భారత జాతీయ గీతం ‘జనగణమన​‍’ వినిపించి పాక్‌ మ్యుజీషియన్‌ కానుక!

15 Aug, 2022 21:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుసర్కరించుకుని.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను ‘రబాబ్‌’ ద్వారా వాయించి భారతీయులకు అంకితమిచ్చాడు పాకిస్థాన్‌కు చెందిన సియాల్‌ ఖాన్‌ రబాబ్‌ వాయిద్యకారుడు. భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ను రబాబ్‌(తంబూర తరహాలో ఉండే రబాబ్‌ పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోనూ ప్రసిద్ధి)తో అద్భుతంగా వాయించారు సియాల్‌ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

‘సరిహద్దుల్లో ఉన్న వీక్షకులకు నా కానుక’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశారు సియాల్‌ఖాన్‌. ‘భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య శాంతి, సామర్యం, సంబంధాలు ఏర్పడేందుకు.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను’ అంటూ సంగీతకారుడు జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు ఒక మిలియన్‌ మంది వీక్షించారు.

ఇదీ చదవండి: పామును ముక్కలుగా కొరికేసిన రెండేళ్ల చిన్నారి!

మరిన్ని వార్తలు