UFO Flying Video: ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులేనా!?

13 Dec, 2021 11:59 IST|Sakshi

గ్రహాంతరవాసులు.. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనలో ఏదో తెలియని ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని వారికి మనుషుల కంటే అధిక శక్తులు ఉంటాయని, టెక్నాలజీ గురించి కూడా తెలుసని చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు తాము అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌ఓ)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా ఏలియన్స్‌ ఆకాశం చక్కర్లు కొడితే.. అవి భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:  చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్‌

అయితే తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌ చక్కర్లు కొట్టిన వీడియో ప్రసుత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. అది ఏలియన్స్‌ పంపిన యూఎఫ్ఓనా లేదా ఏదైనా ఏయిర్‌ క్రాఫ్టా? అని చర్చ జరుగుతోంది. అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌  అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్‌ ఫ్లైయింగ్‌ మిషిన్‌. ఏదైన ఏయిర్‌ క్రాఫ్టు లేదా స్పేస్‌ షిప్‌లు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటికి సంబంధించిన రాడార్‌ సిగ్నల్స్‌ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే యూఎఫ్ఓ వంటి వాటికి రాడార్‌ సిగ్నల్స్‌ ఉండవు.

ఇక కొన్ని సార్లు రాడార్లుకు సంబంధించిన సిగ్నల్‌ కాకుండా వింత మిషన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి! అయితే వాటివి ఇతర గ్రహాల నుంచి వచ్చిన మిషన్‌గా సైంటిస్టులు భావిస్తుంటారు. భూమిపై నుంచి ఎలాంటి ఫ్లైట్‌ లేదా స్పేస్‌ షిప్‌ గాల్లోకి ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడార్‌ సిగ్నల్స్‌ ఉంటాయి. పైలెట్స్‌ వాటిని సులభంగానే గుర్తిస్తారు కూడా. తాజాగా ఓ పైలెట్‌కు ఆకాశంలో వింత ఆకారంలో యూఎఫ్ఓ కనిపించింది.

పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా ఓ పైలెట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన పైలెట్ ఆశ్చర్యానికి గురై తన కెమెరాలో బంధించాడు. కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అవి ఏలియన్స్ యూఎఫ్ఓలని నెటిజన్లు సోషల్‌ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పలు వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు