Red Crabs Viral Videos: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రోడ్లపైకి కోట్లలో పీతలు..

19 Nov, 2021 16:17 IST|Sakshi

Crores Of Red Crabs On The Roads: సాధారణంగా హాలీవుడ్‌ సినిమా మమ్మీ లో రోడ్లపైకి లక్షల సంఖ్యలో తేళ్లు వచ్చిన సన్నివేశం గుర్తుందా. అయితే ఆ సన్నివేశం చిత్రీకరించడానికి దర్శకుడికి చాలా ఖర్చు అయ్యుంటుంది. తాజాగా ఎలాంటి ఖర్చు లేకుండానే సరిగ్గా ఆ సీన్‌ లానే ఓ ప్రాంతంలో లక్షలాది పీతలు వలస వెళ్తూ.. రోడ్లపైకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ప్రాంత దారులన్నీ స్థానిక అధికారులు మూసివేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఐలాండ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  క్రిస్‌మ‌స్ ఐలాండ్‌ సమీపంలోని అడ‌వి నుంచి వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో ఉన్న ఓ పార్క్ తీరం వైపు ఏటా వేల సంఖ్యలో క్రాబ్స్ వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో అక్కడ అడవుల్లో వానలు కురవడం ఆగిపోయిన తరువాత ఇది సముద్రంలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్లాలంటే క్రిస్మస్‌ ఐటాండ్‌లోని రోడ్లు, బ్రిడ్జిల మీదుగానే వెళ్లాలి.

ఇది ప్రతి ఏడాది జరిగేతంతే అయినా ఈ సారి మాత్రం వాటి సంఖ్య వేల కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 5 కోట్ల పీత‌లు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ మస్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు ఒక్కసారిగా పీతలు ఎగ‌బడ్డాయి. కోట్ల సంఖ్యలో వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు.  చివరకు రోడ్లు కూడా మూసి వేశారు.

మరిన్ని వార్తలు