Russia-Ukraine war: ట్యాంకుతో సహా లొంగిపోయాడు

28 Mar, 2022 06:16 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడొకరు ఆ దేశానికి లొంగిపోయాడు. తన అధీనంలోని అత్యాధునిక టి–72బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్‌పరం చేశాడు. బదులుగా 7,500 పౌండ్ల రివార్డుతో పాటు ఉక్రెయిన్‌ పౌరసత్వం పొందనున్నాడు. తాము చేస్తున్నది అర్థం లేని యుద్ధమని మిషా అనే ఆ సైనికుడు అన్నట్టు ఉక్రెయిన్‌ మంత్రి విక్టర్‌ ఆండ్రుసివ్‌ చెప్పారు. రష్యా సైనికులు వాడుతున్న ఫోన్లను గుర్తించిన ఉక్రెయిన్, ఎలా లొంగిపోవాలో వివరిస్తూ కొంతకాలంగా వాటికి ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ వస్తోంది.

అది ఈ విధంగా వర్కౌటవుతోంది. ‘‘మిషా కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ పోలీసులను ఫోన్లో సంప్రదించి లొంగిపోయాడు. రష్యా సైనికులకు తినడానికి తిండి కూడా లేదని అతను చెప్పుకొచ్చాడు. సేనలు నైతికంగా చాలా దెబ్బ తిని ఉన్నాయన్నాడు. ప్రస్తుతానికి మిషాను యుద్ధ ఖైదీగానే చూసినా సకల సౌకర్యాలూ కల్పిస్తాం’’ అని విక్టర్‌ చెప్పుకొచ్చారు. రష్యా యుద్ధ విమానాన్ని స్వాధీనం చేసుకునే వారికి 10 లక్షల డాలర్లు, హెలికాప్టర్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని కూడా ఉక్రెయిన్‌ ప్రకటించింది! ఈ ఆఫర్‌ రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని చెప్పింది!! 

మరిన్ని వార్తలు