టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ 

28 Sep, 2020 10:15 IST|Sakshi

వాషింగ్టన్ : చైనా సోషల్ మీడియా యాప్స్ టిక్‌టాక్, వీచాట్ డౌన్‌లోడ్ల నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వీచాట్,  టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేయకుండా నిరోధించే ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని కోర్టు న్యాయమూర్తి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11:59 గంటలకు అమలులోకి వస్తుందని తెలిపారు. తాజా ఉత్తర్వులపై టిక్‌టాక్ సంతోషం వ్యక్తం చేసింది.  (వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్)

యాపిల్, గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి నికోలస్ నిరాకరించారు. మరోవైపు ఈ విషయంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగా, రాత్రికి రాత్రికి టిక్‌టాక్ డౌన్‌లోడ్‌లపై నిషేధం ఎలా విధిస్తారంటూ ఆదివారం నాటి విచారణలో టిక్‌టాక్ తరపు న్యాయవాది జాన్ ఈ హాల్ వాదించారు.  (టిక్‌టాక్, వీ చాట్‌లపై అమెరికా నిషేధం)

భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను ట్రంప్ నిషేధం విధించింది. ఇందులో భాగంగా ట్రంప్‌ నిర్ణయంపై వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. ట్రంప్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధులు దాటి టిక్‌టాక్‌‌ను బ్యాన్ చేశారని ఆరోపించాయి. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న తమ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదిస్తున్నాయి. కాగా చైనా యాప్స్ నిషేధానికి సంబంధించి ట్రంప్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా కోర్టులు ఆదేశాలివ్వడం ఇది రెండవసారి. గతవారం వీచాట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై  కాలిఫోర్నియా కోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా