Top 10 Telugu News: టాప్‌ 10 తెలుగు ట్రెండింగ్‌ న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో

13 May, 2022 10:00 IST|Sakshi

1. నాటో దిశగా ఫిన్‌లాండ్‌ అడుగులు
నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్‌లాండ్‌ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్‌లాండ్‌ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘హస్త’ వాసి మారేనా?
వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న చింతన్‌ శిబిర్‌ శుక్రవారం నుంచి మొదలు కానుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్‌ మలేసియా జట్టును క్వార్టర్‌ ఫైనల్లో ఓడించిన భారత్‌ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ సెమీఫైనల్‌ చేరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడ్డారు. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతనిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఫస్ట్‌ ఎయిర్‌టెల్.. సెకండ్‌ జియో..
మార్చి నెలలో జియో, ఎయిర్‌టెల్‌ కొత్త చందాదారులను సొంతం చేసుకున్నాయి. ఎయిర్‌టెల్‌ నికరంగా 22.55 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. జియో కొత్త కస్టమర్లు 12.6 లక్షలుగా ఉన్నారు. వొడాఫోన్‌ ఐడియా 28.18 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Summer Drinks: రోజు గ్లాసు బీట్‌రూట్‌ – దానిమ్మ జ్యూస్‌ తాగారంటే..
కావలసినవి: బీట్‌రూట్‌ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి
కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్‌ సెంటర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టెన్త్‌ విద్యార్థులకు ‘పరీక్షే’!
పదో తరగతి పరీక్షలు రాయబోతున్న లక్షలాది మందిలో ఇలాంటి ఆందోళనే కనిపిస్తోందని ఉపాధ్యాయులు చెప్తున్నా రు. గత రెండేళ్లలో ప్రత్యక్ష తరగతులు లేక, ఆన్‌లైన్‌ తరగతులు అర్థంకాక, నెట్‌వర్క్‌ సమస్యలతో అసలు పాఠాలే వినలేని పరిస్థితులతో ఇప్పుడు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతు న్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు