కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 11మంది మృతి

5 Mar, 2021 10:29 IST|Sakshi
ప్రమాద దృశ్యం

అంకారా : ప్రమాదవశాత్తు మిలిటరీ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన టర్కీలోని టట్వాన్‌లో గురువారం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ టట్వాన్‌నుంచి బింగోల్‌ వెళుతున్న నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇ‍ద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో లెఫ్టినెంట్‌ జెనర్‌ ఒస్మానా ఎర్‌బాస్‌, ఆర్మీకాప్‌ కమాండ‌ర్లు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్న వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై యురోపియన్‌ యూనియన్‌, అమెరికాలు తమ సంతాపం తెలియజేశాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు