వరుడికి చేదు అనుభవం.. వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు

4 Dec, 2021 17:03 IST|Sakshi

అమెరికా, మిన్నెసోటాలో చోట చేసుకున్న సంఘటన

రక్తహీనత, లోబీపీ కారణంగా కళ్లు తిరిగిపడిపోయిన వధువు

వాషింగ్టన్‌: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన మధుర జ్ఞాపకం. వివాహ వేడుకను జీవితాంతం మరచిపోలేని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని కలలు కంటారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక పెళ్లి అంటే బోలేడు పనులు. ఇంట్లో సాయం చేసేవారు ఎవరు లేకపోతే.. పాపం కాబోయే వధువరులే ఆ పనులన్ని చూసుకోవాలి. ఇలా పనుల ఒత్తిడిలో పడి అలసిపోతే.. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ వార్త చదివితే తెలుస్తుంది. ఈ జంటకు ఎదురైన కష్టాలు చూస్తే.. పాపం వీరంత దురదృష్టవంతులు ఈ భూమ్మీద ఇంక ఎవరు లేరనిపిస్తుది. ఆ వివరాలు.. 

అమెరికా, మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్‌లు‌ వివాహం చేసుకుందామని భావించారు. డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్ని వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. 
(చదవండి: మహిళా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ ఆకాశమే హద్దు...)

మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది. 

బయట బాగా వేడిగా ఉండటం వల్లనే హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్‌ ఆన్ని‌ చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్‌ దగ్గరకు వెళ్లింది. వాడికి అప్పుడే గుర్తొచ్చిందేమో.. పెళ్లి కుమార్తె అని కూడా చూడకుండా.. హోలీ మీద మల విసర్జన చేశాడు. జరిగిన అన్ని సంఘటనలతో హోలీకి ఒకలాంటి విరక్తి కలిగింది. 
(చదవండి: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్‌!)

త్వరగా పెళ్లి తంతు ముగుంచుకుని.. ఆస్పత్రికి వెళ్లింది హోలీ. ఆమెను పరీక్షించిన వైద్యులు.. లో బీపీ, రక్తహీనతతో బాధపడుతుందని.. అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. ఇక విహానికి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా హోలీ దంపతులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అంటే అందరికి చాలా మంచి అనుభూతులు ఉంటాయి. మాకు ఎదురైన అనుభవాలు తల్చుకుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది. ఇప్పుడే ఇవే సంఘటనలను మా ముందు తరాలకు చెప్పాలి. కనీసం వారు అయినా జాగ్రత్త పడతారు’’ అని చెప్పుకొచ్చారు. 

చదవండి: ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..'

మరిన్ని వార్తలు