విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్‌లో భారత్‌

9 Sep, 2022 19:43 IST|Sakshi

US Povide Pakistan For F-16 fighter jet fleet sustainment program: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని యూఎస్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌16 ఫైటర్‌ జెట్‌ సస్టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్‌ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్‌ నేతృత్వంలో యూఎస్‌ ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో భారత్‌ తీవ్ర అభ్యంతరాలతోపాటు భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐతే అమెరికా మాత్రం ఇది కేవలం అమ్మాకాలే కానీ సహాయం కాదని తేల్చి చెప్పింది.

ఈ మేరకు యూఎస్‌ దక్షిణాసియా, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్‌ లూ మాట్లాడుతూ.... ఒక దేశానికి అందించే రక్షణ పరికరాలకు మద్దతు ఇవ్వడం యూఎస్‌ ప్రభుత్వ విధానమని నొక్కి చెప్పారు. అంటే దీని అర్థం కేవలం పాక్‌తో ఉన్న ఎఫ్‌16 విమానాలకు సంబంధించిన విడిభాగాల విక్రయం మాత్రేమనని సహాయం కాదని తేల్చి చెప్పారు.

తాము కేవలం పరికరాల సేవలను మాత్రమే ప్రతిపాదిస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల విమానాలు వాయు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. తాము భారత్‌ ఆందోళనలను అర్థం చేసుకున్నామని అన్నారు. పాక్‌లో ఉన్న ఎఫ్‌16 యుద్ధ విమానాలు 40 ఏళ్లకు పైబడినవి అందువల్ల ఆయా భాగాలకు సంబంధించిన సర్వీస్‌ని అందిస్తున్నామే తప్ప కొత్త విమానాలను ఏమి అందిచండం లేదని స్పష్టం చేశారు.

ఐతే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాలిబన్‌ హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్రవాద గ్రూపులను అణిచివేయడం తోపాటు, వారి సురక్షిత స్థావరాలను కూల్చివేయడంలో విఫలమైనందున పాకిస్తాన్‌కు సుమారు రెండు వేల బిలియన్‌ డాలర్ల భద్రతాసహాయాన్ని నిలిపేశారు.

(చదవండి: ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....)

మరిన్ని వార్తలు