వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్‌ ఆఫర్‌

20 Nov, 2023 20:25 IST|Sakshi

థాయ్‌లాండ్‌, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్‌ న్యూస్‌  చెప్పనేంది.   వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ  యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్‌లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది.

వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్‌ వంటి ప్రధాన మార్కెట్‌లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన  కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని  వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది.

2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన  అంతర్జాతీయ  టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్‌కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు  సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు.

కాగా అక్టోబర్‌లో, థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు