పాక్‌ అణు విస్తరణ కొనసాగింపు: యూఎస్‌ఏ

19 May, 2022 07:49 IST|Sakshi

వాషింగ్టన్‌: అణుసామర్థ్య విస్తరణ, ఆధునీకరణను పాకిస్తాన్‌ 2022లో కూడా కొనసాగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారి స్కాట్‌ బెరియర్‌ అభిప్రాయపడ్డారు. భారత అణుసంపత్తిని, ఆధిక్యతను తట్టుకొని మనుగడ సాగించేందుకు పాక్‌ అణువిస్తరణ చర్యలను సమర్థించుకుంటుందన్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పాక్‌ రక్షణ విధానాలను నిర్దేశిస్తాయని కాంగ్రెస్‌ సభ్యులకు ఇచ్చిన నివేదికలో స్కాట్‌ చెప్పారు.

2019లో కశ్మీర్‌ ప్రత్యేక హోదాను భారత్‌ తొలగించడం ఉద్రిక్తతలు మరింత పెరిగేందుకు కారణమైందన్నారు. అయితే 2021 తర్వాత సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు తగ్గినట్లు తెలిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక దౌత్య పరిష్కారం వైపు దృష్టి సారించడంలేదన్నారు.   
చదవండి: మానవత్వం అంటే మనుషులకేనా?.. ఈ వీడియో ఏం చెబుతోంది!

మరిన్ని వార్తలు