Lamborghini: రూ.6 కోట్ల కారు.. పార్కింగ్ చేయమని ఇస్తే నాశనం చేశారు..

9 Feb, 2023 21:34 IST|Sakshi

కాన్‌బెర్రా: రెండు లాంబోర్గిని కార్లు. వీటి విలువ రూ.12 కోట్లు. ఓ లగ్జరీ హోటల్‌కు వెళ్లిన కోటీశ్వరుడు ఈ కార్లను తీసుకెళ్లాడు. అయితే పార్కింగ్ చేయమని చెప్పి ఈ కార్ల కీస్‌ను హోటల్ సిబ్బందికి ఇచ్చాడు.

ఇంత ఖరీదైన కారు ఎక్కానని ఆనందంలోనే, లేక డ్రైవింగ్ సరిగ్గా రాకనో తెలియదు గానీ.. హోటల్ సిబ్బంది ఈ కారును ప్రమాదానికి గురి చేశాడు. అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. అంతేకాదు ముందున్న మరో లాంబోర్గినిని కూడా ఢీకొట్టాడు. దీంతో ఓనర్ కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

A post shared by Craig Jones (@craigjonesbjj)

ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. ఈ కార్ల యజమాని పేరు లారెన్స్ ఎస్కలాంటే. పెర్త్‌లోని లగ్జరీ హోటల్ క్రౌన్ టవర్స్‌కు అతను వెళ్లినప్పుడు ఇలా జరిగింది.
చదవండి: చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పనీర్ పెట్టలేదని రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌..

మరిన్ని వార్తలు