సెక్యూరిటీ కెమెరాల్లో ప‌దిలంగా తండ్రి ప్రేమ

1 Dec, 2020 20:54 IST|Sakshi

కూతురికి తండ్రంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ల‌కు కూడా అంతే.. కొడుకు క‌న్నా కూతుర్లంటేనే అమిత‌మైన ప్రేమ‌. వారికోసం ఆకాశంలోని చంద‌మామ‌ను కూడా తెచ్చిచ్చేందుకు సై అంటారు.కూతురి ముఖం గుర్తొస్తే చాలు కొండ‌నైనా అవ‌లీల‌గా ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తామంటారు. చివ‌రికి బంగారు త‌ల్లి ముఖం చూడ‌గానే అప్ప‌టివ‌ర‌కు ప‌డ్డ శ్ర‌మంతా ప‌టాపంచ‌లైపోతుంది. అంత‌టి గొప్ప బంధం తండ్రీకూతుళ్ల‌ది. ఈ బంధానికి సాక్ష్యంగా నిలిచిందీ ఘ‌ట‌న‌. అమెరికాలోని లూయిస్‌విల్లేలో హ‌న్నా కుటుంబం నివ‌సిస్తోంది. హ‌న్నా తండ్రికి కూతురంటే పంచ ప్రాణాలు. అందుకే రోజూ ఉద‌యం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు సెక్యూరిటీ కెమెరాల ద‌గ్గ‌ర కొన్ని సెకన్లు ఆగి హ‌న్నాకు గుడ్‌మార్నింగ్ చెప్తాడు. (చ‌ద‌వండి: నాన్న చంపాలని చూస్తున్నారు : నటి వైరల్ వీడియో)

'ఈ రోజంతా నీకు మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా, ఈ రోజు నీకు గొప్ప‌గా ఉండ‌బోతుంది..' అంటూ ర‌క‌ర‌కాల విషెస్ చెప్పేవాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక‌వేళ హ‌న్నా ఇంటి నుంచి వెళ్లిపోయినా ఆమెకు తండ్రి ప్రేమ మాత్రం ప్ర‌తిరోజూ దొరుకుతుంది అని క్యాప్ష‌న్ జ‌త చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌‌న్లు.. హ‌న్నా ఎవ‌రో తెలీక‌పోయినా ఆమె పొందుతున్న‌ ప్రేమ‌ను చూసి ఎమోష‌న‌ల్ అవుతున్నారు. హ‌న్నా, ఆమె కుటుంబం ఎప్ప‌టికీ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. (చ‌ద‌వండి: వైరల్‌: యువతి తలను కోసుకుని తినొచ్చు!!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు