వావ్‌ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్‌ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!

13 Nov, 2021 07:41 IST|Sakshi

ఒక్కోసారి మనకు రకరకాల ఆకృతిలో ఆకాశంలోని మబ్బులు కనిపిస్తాయి. అవి చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొసారి ఆకాశంలో అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. పైగా వాటిని కెమరాలో బంధించే లోపే అవి దృశ్యమైపోతాయి. మనం పొరపడ్డామేమో అనిపించేలాంటి కొన్ని విచిత్ర దృశ్యాలు చూసిన అనుభవం కొద్దిమందికి ఎదురై ఉంటుంది. అలాగే ఇక్కడొక మనిషికి అలాంటి సంఘటన ఎదురైంది. కాకపోతే అతను దాన్ని కెమరాలో బంధించి మరి చూపిస్తున్నాడు. ఇపుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష)

అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లో నివసిస్తున్న లూకా అనే ఒక డెలివరీ డ్రైవర్‌ ఆకాశంలో తేలియాడే ఒ‍క చెక్‌ చీపురుని చూస్తాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. పైగా ఆ చీపురికి ఎవరైన తాడు కట్టి అలా ఎగిరేలా చేస్తున్నారా అని కూడా పరిశీలనగా చూస్తాడు. కానీ అది మాములుగానే మాయద్వీపం, అల్లావుద్దీన్‌ అద్భుతం దీపం, హ్యారీపాటర్‌ వంటి సినిమాల్లో మాదిరి అదృశ్య వస్త్రంలా ఎగురుతుంది. పైగా దాన్ని వీడియోలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తాడు. దీంతో నెటిజన్లు ఏంటి మాయా దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్‌​ చేశారు.

(చదవండి: నువ్వే స్టెప్‌ వేస్తే అదే స్టెప్‌ వేస్తా!!:వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో)

మరిన్ని వార్తలు