వైరల్‌: క్రిస్‌మస్‌ చెట్టు మీద కోలా

24 Dec, 2020 20:58 IST|Sakshi

కాన్‌బెర్రా: రేపే క్రిస్‌మస్‌ పండుగ. ఇప్పటికే ఎంతో మంది క్రిస్‌మస్‌ చెట్లను అందంగా అలంకరించి పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన కుటుంబం కూడా క్రిస్‌మస్‌ చెట్టును బెలూన్లు, లైట్లు, స్టార్లతో అందంగా రెడీ చేసింది. అయితే ఏదో పని మీద ఇంటిసభ్యులు మధ్యాహ్నం బయటకు వెళ్లారు. ఇంతలో ఎలా వచ్చిందో ఏమో కానీ ఓ కోలా ఇంట్లో దూరి అది నిజమైన చెట్టు అనుకుని దాన్నే అంటిపెట్టుకుంది. తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కూడా దాన్ని చూసి మొదట ఏదో బొమ్మ అని భ్రమ పడ్డారు. (చదవండి: అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల)

కానీ అది నిజమైన కోలా అని అర్థం కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరిని చూసి భయపడ్డ కోలా చెట్టు దిగి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తర్వాత రెస్క్యూ బృందం రంగంలోకి దిగి కోలాను తీసుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ సంఘటన గురించి ఆ కుటుంబంలోని పదహారేళ్ల అమ్మాయి మాట్లాడుతూ.. 'అది నిజమైన చెట్టు కాదు, పాతది కూడా. అయినా సరే కోలా ఆ చెట్టు ఆకులను నమలడానికి ప్రయత్నించింది. కానీ అది ప్లాస్టిక్‌ అని అర్థం కావడంతో వాటిని తినడం ఆపేసింది' అని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: వైరల్‌: వధువు పాదాలను మొక్కిన వరుడు..)

మరిన్ని వార్తలు