ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!

26 Mar, 2022 16:40 IST|Sakshi

According WHO healthcare situation: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల పైగా దాడి చేస్తూనే ఉంది. వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కేవలం ఉక్రెయన్‌కి ప్రాణ, ఆస్తి నష్టం మాత్రమే కలగించలేదు, అంతకుమంచిన తీవ్ర దుష్పరిణామాను మిగిల్చింది. ఈ నిరవధిక దాడుల కారణంగా ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురుయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైమానికి దాడుల కారణంగా కాలుష్యం ఎక్కువై నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని చెబుతోంది. ప్రస్తుతం రష్యా బలగాలు మారయుపోల్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశారు.

నిజానికి 2011లో మారియుపోల్ తొలి కలరా వ్యాధిని గుర్తించారు. మళ్లీ ఈ యుద్ధం కారణంగా ఆ వ్యాధి మరింత ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మార్చి 18 నాటికి లుహాన్స్క్ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి నీటి సౌకర్యం లేదని తెలిపింది. అయితే ప్రభుత్వేతర నియంత్రిత ప్రాంతాలలో కూడా దాదాపు 4 లక్షల మందికి నీటి సరఫరా లేదని వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా చాలామంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల డిజార్డర్ డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. గర్భనిరోధకం అందుబాటులో లేకపోవడం వల్ల  లైంగిక పరంగా హింసకు గురయ్యే ప్రమాదం పోంచి ఉందని తెలిపింది. అదీగాక లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అంటోంది.

ప్రమాదకరమైన సంక్రమిత అంటు వ్యాధులు

కోవిడ్‌-19 కేసులు
ఈ బాంబుల దాడుల కారణంగా ఒకే షెల్టర్‌లో కోవిడ్‌ -19 పేషంట్లకు వైద్యం అందించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది కాక ఈ బాంబు దాడుల కారణంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ఎక్కువయ్యే అవకాశం ఉంది. మార్చి 17 కల్లా ఉక్రెయిన్‌లో సుమారు  27,671 కోవిడ్ -19 కేసులు 384 మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. అయినా ఈ యుద్ధ తీవ్రత కారణంగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం  కూడా కష్టమేనని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది.

మీజిల్స్ కేసులు
మార్చి 22న, రొమేనియాకు వచ్చి శిబిరాల్లో ఉంటున్న ఉక్రేనియన్ శరణార్థులలో మూడు అనుమానిత మీజిల్స్ కేసులు గుర్తించనట్లు  నివేదిక తెలపింది. 

ప్రసవానంతర సంరక్షణ
వచ్చే మూడు నెలల్లో ఉక్రెయిన్‌లో దాదాపు 80 వేల మంది మహిళలు జన్మనిస్తారని అంచనా. ప్రసూతి సంరక్షణకు అంతరాయం ఏర్పడి ప్రసూతి నియోనాటల్ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అదీగాక  ప్రసూతి ఆసుపత్రులతో సహా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడుల కారణంగా సిజేరియన్ వంటి విధానాలను నిర్వహించడం, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అందించడం వంటి ప్రసూతి సమస్యలను నిర్వహించే సామర్థ్యం కూడా తగ్గిందని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలో వెల్లడించింది.

(చదవండి: ఫస్ట్‌ స్టేజ్‌ మిలటరీ ఆపరేషన్‌ ఫినిష్‌... అదే మా లక్ష్యం!)

మరిన్ని వార్తలు