ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు

30 Oct, 2020 21:18 IST|Sakshi

కారు అయితే రోడ్డుపై వెళుతుంది...అదే విమానం అయితే ఆకాశంలో వెళ్లాలనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటిది కారును, విమానాన్ని ఏకకాలంలో వాడుకునేందుకు కుదరదు.  అది ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అలాంటి ఊహను మనకు నిజం చేసి చూపించారు స్లోవేకియా ఎయిర్‌లైన్స్‌ అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని స్లోవేకియా సంస్థ క్లీన్విజన్ తయారుచేసింది. ఇటీవలే టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించారు.(చదవండి : టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం)

కారు రన్‌వేపై వెళ్లేటప్పుడు విమానంలాగా రెక్కలు వచ్చి, ఒక్కసారిగా గాల్లోకి లేచింది. భూమినుంచి 1,500 అడుగుల ఎత్తులో స్లోవేకియా మీదుగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని ఎయిర్‌కార్‌గా పిలుస్తున్నారు. గాలిలో ఎగిరే కారును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎయిర్‌కార్‌ను  రెండు సీట్లున్న ఈ కారు మోడల్‌ బరువు 1,100 కిలోలు. 200 కిలోల అదనపు లోడ్ మోయగలదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యూ 1.6 ఎల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కార్-ప్లేన్ 140 హెచ్‌పీ శక్తిని కలిగి ఉంటుంది. 1,000 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు.(చదవండి : 50 అడుగుల అన‌కొండ‌.. వీడియో వైర‌ల్)

  

మరిన్ని వార్తలు