లక్షమందిలో ఒకరికి సంభవించే వ్యాధి..ఉన్నపళంగా ఎముకలు..

6 Jun, 2023 17:29 IST|Sakshi

కొన్ని వ్యాధులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అనేలా ఉంటాయా ఆ వ్యాధులు. అలాంటి అరుదైన వ్యాధి బారినేపడింది సదరు మహిళ. అసలేం జరిగిందంటే..న్యూయార్క్‌కి చెందిన 24 ఏళ్ల బెథాని ఈసన్‌ అనే మహిళ జస్ట్‌ అలా బాత్రూంకి వెళ్లింది అంతే మోకాలి ఎముకలు పెళ పెళ మంటూ విరిగిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి వెళ్లగా..ఎక్స్‌రే తీయించుకోవాల్సిందిగా సూచించారు వైద్యులు.

ఆ తదనంతరం నిర్వహించి వైద్య పరీక్షల్లో ఆమెకు ఎముకల్లో కణితి ఉన్నట్లు తేల్చారు. దీని వల్ల చుట్టుపక్క ఉన్న మృదుకణజాలం బలహీనమై మెకాలి నుంచి తొడ ఎముకలు పెళపెళ​మని విరగిపోతాయని అన్నారు. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సర్జరీ కూడా అత్యంత క్లిష్టమైనది, విజయవంతమయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీంతో బెథానికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. ఈ వ్యాధి గురించి పలువురిని సంప్రదించింది కూడా అందరూ అదేమాట చెప్పారు. పైగా దీని భారినపడిన వారుకూడా ఇప్పటికీ తాము నడవలేకపోతున్నట్లు ఆమెకు చెప్పారు.  

అంతేగాదు పలువురు బతికే ఉన్నా కూడా.. నడుం కింద నుంచి శరీరం అంతా చచ్చుపడిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఆమెను హెచ్చరించారు కూడా. అయినప్పటికి ధైర్యం తెచ్చుకుని మరీ విజయవంతంగా ఆపరేషన్ చేయించుకుంది. ఆమె మోకాలి నుంచి తొడ ఎముకల వరకు సర్జరీ చేశారు వైద్యులు. ఇంకెప్పుడూ హీల్స్‌ ధరించకూడదని సూచించారు. అంతేగాదు ఆమె కొత్తగా నడవడం నేర్చుకోవాల్సి ఉంటుందని బెథానికి తెలిపారు వైద్యులు. ఇది చాలా నొప్పితో  కూడిని సర్జరీ అని బెథాని చెబుతోంది. ప్రాణాంతకం కాకుడాదంటే.. నొప్పిని భరిస్తూ సర్జరీ చేయించుకోక తప్పదని వాపోయింది. 

(చదవండి: ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది: అమెరికా)

మరిన్ని వార్తలు