పరిమిత నమ్మకాలే అభివృద్ధికి ఆటంకం

25 Feb, 2023 13:40 IST|Sakshi

దర్మపురి: ప్రతి వ్యక్తిలో అపరిమితమైన శక్తి ఉంటుందని, చాలా మంది దాన్ని తక్కువ చేసుకొని, తమ నమ్మకాలను పరిమితం చేసుకోవడం అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని ఇంపాక్ట్‌ ట్రైనర్‌, సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ అన్నారు. ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏగాగ్రతపై పలు సూచనలు చేశారు. విజయం సాధించాలని బలమైన కోరిక ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరుతుందని, విద్యార్థి దశనుంచే ఒక విజన్‌తో ఉండాలని చెప్పారు. అనవసరపు ఆలోచనలు మెదడులోకి చేరవేస్తే దాని సామర్థ్యం తగ్గిపోతుందని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రవీందర్‌, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు