నేడు ధర్మపురికి రేవంత్‌రెడ్డి రాక | Sakshi
Sakshi News home page

నేడు ధర్మపురికి రేవంత్‌రెడ్డి రాక

Published Sat, Nov 11 2023 12:52 AM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న అడ్లూరి, నాయకులు
 - Sakshi

ధర్మపురి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు అనుమల్ల రేవంత్‌రెడ్డి శనివారం ధర్మపురికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలిప్యాడ్‌లో ధర్మపురికి చేరుకొని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈమేరకు సభ ఏర్పాట్లను శుక్రవారం ధర్మపురి అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరిశీలించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో 100 మంది వరకు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాలి

జగిత్యాలక్రైం: ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం పోలీసు అధికారులు, సెక్టోరల్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ టీమ్స్‌, పోలీసు సిబ్బందికి లీగల్‌ అడ్వైజర్‌ ద్వారా ఎన్నికల్లో చేయాల్సిన చ ట్టాలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన క ల్పించారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులకు హైదరాబాద్‌ సిటీ పోలీసు లీగల్‌ అడ్వైజర్‌ శ్రీరాములు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన చట్టాలు, ఎకై ్సజ్‌ యాక్ట్‌, సి టీ పోలీసు యాక్ట్‌ సహా నేరాలపై తీసుకోవాల్సి న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రతి వాహనాన్ని ఎస్‌వోపీ ప్రకారం తనిఖీ చేయాలన్నారు.

జాతీయ పురస్కారానికి అంజనశ్రీ

రాయికల్‌(జగిత్యాల): తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ పురస్కారానికి రాయికల్‌ మండలం రామాజీపేటకు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ ఎంపికై నట్లు తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. డిసెంబర్‌ 10న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజనశ్రీని ప్రగతి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ బాలె జయశ్రీ శేఖర్‌ తదితరులు అభినందించారు.

విధుల నుంచి తొలగింపు

జగిత్యాల: కాంట్రాక్ట్‌ పద్ధతిలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌గా రాయికల్‌ మండలం మైతాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పని నిర్వహిస్తున్న దేవేందర్‌రెడ్డిని విధుల నుంచి తొలగించినట్లు డీఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సందర్భంగా భూపతిపూర్‌ గ్రామంలో ఓ రాజకీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవేందర్‌రెడ్డి పాల్గొన్నట్లు నిరూపితమైందని, అతను ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలు అతిక్రమించినందున విధుల నుంచి తొలగించినట్లు డీఈవో పేర్కొన్నారు.

మాట్లాడుతున్న  ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌
1/2

మాట్లాడుతున్న ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

2/2

Advertisement
Advertisement