9999 నంబరుకు రూ.4.61లక్షలు

21 Sep, 2023 01:48 IST|Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): వాహనాల నంబర్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో మంచిర్యాల జిల్లా రవాణా శాఖా కార్యాలయానికి బుధవారం భారీగా ఆదాయం సమకూరింది. టీఎస్‌ 19 హెచ్‌ సిరీస్‌ ముగింపుతోపాటు టీఎస్‌ 19 జే సిరీస్‌ ప్రారంభంలో రవాణాశాఖకు భారీ ఆదాయం వచ్చింది. టీఎస్‌ 19 హెచ్‌ 9999 నంబర్‌కు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో గత ఏడాది సిరీస్‌లో రూ.3 లక్షల వరకు రాగా ఈ ఏడాది రూ.4,61,111 ఆదాయం వచ్చింది. ఇక బుధవారం ఒక్క రోజే 12 వాహనాల లక్కీ నంబర్లకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్‌ 19 హెచ్‌ 9999 నంబరు కోసం ఆన్‌లైన్‌లో నలుగురు పోటీ పడగా విక్టర్‌ దినేశ్‌ రూ.4,61,111కు దక్కించుకున్నాడు.

టీఎస్‌ 19 జే 0001 నంబరు కోసం ముగ్గురు పోటీ పడగా అరికెపూడి శివకుమార్‌ రూ.1.17 లక్షలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్‌ 19 జే 0006 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన కంకణాల శ్యాంసుందర్‌ రూ.95 వేలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్‌ 19 జే 0009 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన రాజశేఖర్‌ అతి తక్కువలో అంటే రూ.50,000కే సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇవే కాకుండా టీఎస్‌ 19 హెచ్‌ 9988 నంబరుకు రూ.5 వేలు, టీఎస్‌ 19 హెచ్‌ 9995 నంబరుకు రూ.2 వేలు, టీఎస్‌ 19 జే 0008 నంబరుకు 13,600, టీఎస్‌ 19 హెచ్‌ 9996 నంబరు రూ.5 వేలు, టీఎస్‌ 19 జే 0005 నంబరు రూ.10 వేలు, టీఎస్‌ 19 హెచ్‌ 9998 నంబరు రూ.5 వేలు, టీఎస్‌ 19 హెచ్‌ 9008 నంబరు రూ.5 వేలు, టీఎస్‌ 19 జే 0003 నంబరు రూ.10 వేలు, టీఎస్‌ 19 హెచ్‌ 9969 నంబరు రూ.5 వేలతో బిడ్డింగ్‌ పలికింది. ఇక రవాణా శాఖకు ఈ నంబర్ల ఫీజుల ద్వారా రూ.2,04,000, మొత్తం బిడ్డింగ్‌ ద్వారా రూ.7,11,712 వరకు ఆదాయం సమకూరినట్లు డీటీఓ కిష్టయ్య తెలిపారు. కాగా రవాణా శాఖలో వాహన నంబర్ల కేటాయింపు సిరీస్‌ ముగింపు, ప్రారంభంలో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది.

మరిన్ని వార్తలు