కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్‌

28 Mar, 2024 00:45 IST|Sakshi
మోటార్‌ వైండింగ్‌ చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌, కౌశిక్‌రెడ్డి - Sakshi

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం వీణ వంక మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈసందర్భంగా మోటార్‌ వైండింగ్‌ షాపులో రిపేరు చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ మోటార్లు కాలి పోయి రిపేరుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కేసీఆర్‌ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు ఏనాడు ఈ పరిస్థితి రాలేదని వివరించారు. కేసీ ఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని, రైతులు, ప్రజలు, యువత, మేధావులు ఆలో చన చేయాలని కోరారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఓ హోటల్‌లో చాయ్‌ తాగుతూ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు..
విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు. 11 కేవీ తీగలగుట్టపల్లి ఫీడర్‌ పరిధిలోని మాణికేశ్వరీనగర్‌, కార్తీకేయనగర్‌, విఘ్నేశ్వరనగర్‌, అయోధ్యనగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers