'కోవిడ్‌ సమయంలో మ్యూజిక్‌ థెరపి గొప్పదనం తెలిసింది'..

17 Nov, 2023 10:57 IST|Sakshi

‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్‌. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్‌ స్పేస్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్‌ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్‌తో అప్‌డెట్‌ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్‌ చేశారు.
 
‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్‌ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్‌ కల్లోల కాలంలో మ్యూజిక్‌ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల. 

మరిన్ని వార్తలు