తెలుగు వ్యక్తికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి

7 Feb, 2021 06:30 IST|Sakshi

మహారాష్ట్రలో ఉపాధ్యక్షుడిగా నియమితులైన కైలాస్‌ గోరింట్యాల్‌

సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి (ఎంపీసీసీ) ఉపాధ్యక్ష పదవి తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకి చెందిన తెలుగువ్యక్తిని వరించింది. ఎంపీసీసీ అధ్యక్షునితోపాటు ఆరుగురు కార్య«ధ్యక్షులు, 10 మంది ఉపా««ధ్యక్షులను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. వీరిలో మరాఠ్వాడాలో ప్రస్తుతం ఏకైక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన జాల్నా ఎమ్మెల్యే కైలాస్‌ గోరింట్యాల్‌ ఉన్నారు. కైలాస్‌ పూర్వికులు జీవనోపాధికోసం మహారాష్ట్రకు వలసవచ్చారు. కైలాస్‌ తండ్రి కిషన్‌ రావ్‌ కాంగ్రెస్‌ కోశాధికారిగా పనిచేశారు. కైలాస్‌ మేనమామ బీజేపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండడంతో కైలాస్‌ చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తిపెరిగింది. కాలేజీ రోజుల నుంచి రాజకీయా ల్లో క్రియాశీలంగా ఉన్నారు.

1986లో మరాఠ్వాడా యూనివర్సిటీ సెనెటర్‌గా గెలుపొందిన ఆయన 1991లో జాల్నా కౌన్సిలర్‌గా, 1992లో కౌన్సిల్‌ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత కైలాస్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం 1999లో జాల్నా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై 20 వేల మెజార్టీతో శివసేన అభ్యర్థి అంబేకర్‌ భాస్కర్‌పై గెలిచారు. 2014లో ఓడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జాల్నా నియోజకవర్గం నుంచి గెలిచారు. జాల్నా నియోజకవర్గంలో ఆయన అనేక అభివద్ది పనులు చేశారు. వీటిలో ప్రధానంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్, ఎంఐడీసీలో రూ.120 కోట్లతో విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది యువతకు ఉపాధి కల్పించా రు. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో కైలాస్‌ కుటుంబీకులు తెలుగు పాఠశాల స్థాపనకు కృషి చేశారు. కాలక్రమేణా తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్‌ వైపుకు మొగ్గుచూపడంతో తెలుగు పాఠశాలలను మూసేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు