శర్వానంద్ చిత్రంలో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్

3 Aug, 2021 18:24 IST|Sakshi

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు సీనియర్‌ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఒక్క సీనియర్‌ నటి ఉంటేనే ఆయా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అలాంటిది ఒకే చిత్రంలో ముగ్గురు సీనియర్‌ తారలు నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు