తీస్‌మార్‌ ఖాన్‌ సెట్లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. 

25 Dec, 2021 18:51 IST|Sakshi

'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ త్వరలోనే  'తీస్ మార్ ఖాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

డిసెంబర్‌ 25న నిర్మాత  నాగం తిరుప‌తి రెడ్డి బర్త్‌డే వేడుకను విజన్ సినిమాస్ ఆఫీసులో తీస్ మార్ ఖాన్ టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది సాయికుమార్‌, సునీల్‌ సహా మూవీ టాం పాల్గొంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ''ముందుగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నా. నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణలతో 'తీస్ మార్ ఖాన్' సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశాం. దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు అని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు