Acharya Twitter Review: ‘ఆచార్య’ టాక్‌ ఎలా ఉందంటే..

29 Apr, 2022 06:14 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 29)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్‌ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. 

ఇక  ఓవర్సీస్‌తో పాటు  పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

ఫస్టాప్‌ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్‌ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

ఫస్టాఫ్‌ ఏదో అలా వెళ్లిపోయింది. ఎలివేషన్స్‌లేవు... స్లోగా సాగుతుంది. ఇది కొరటాల సినిమాలా లేదు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు