ఆస్పత్రిలో ప్రభు

23 Feb, 2023 02:19 IST|Sakshi

ప్రముఖ నటుడు ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన చెన్నై కోడంబాక్కంలోని మెడ్‌వే ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాళ్లను తొలగించడానికి యుకిథ్రోస్‌ కోఫీ అనే లేజర్‌ శస్త్ర చికిత్సను మంగళవారం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రెండు రోజుల్లో ఆస్పత్రి  నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు