అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం

25 Aug, 2021 21:30 IST|Sakshi

సీనియ‌ర్ న‌టి ఆమ‌ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. జంబలకిడిపంబ’  వంటి కామెడీ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న అందుకున్న ఆమ‌ని ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో తెలుగుంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో సనిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత తెరపూ కనుమరుగయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆ నలుగురు మూవీతో సెకండ్‌ ఇన్నింగ్‌ ఇచ్చారు. అప్పటి నుంచి స‌హాయ పాత్రలు పోషిస్తూ అల‌రిస్తున్న ఆమె ఇటీవల బుల్లితెరపై కూడా అరంగేట్రం చేశారు.

చదవండి: తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ

ఈ నేపథ్యంలో ఓ టీవీ షోకు నటి ఇంద్రజతో హజరయ్యారు. ఈ షోలో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. జయసుధ, శ్రీదేవిలను చూసి నేను కూడా వారిలా ఎప్పుడు నటిస్తానా అని అనుకునేదాన్ని. ఇక పెద్దాయ్యాక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు బంధువులంతా ఎగతాళి చేశారు. నేను సినిమాల్లో నటించడమేంటీ, అంత పెద్ద అందగత్తె ఏం కాదు కదా అని విమర్శించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆమని ‘ముత్యమంతా ముద్దు’ అనే సీరియల్లో డబ్బు ఆశ ఉండే అత్తగా నటిస్తున్నారు.

చదవండి: తొలిసారి తన ఆస్తులపై స్పందించిన సుడిగాలి సుధీర్‌

మరిన్ని వార్తలు