Pooja Hegde: నడవలేని స్థితిలో పూజ.. ఫొటో షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

20 Oct, 2022 19:00 IST|Sakshi

ప్రస్తుతం పుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 (SSMB28)తో పాటు బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే అందులో సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం ఒకటి. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటుంది. ఇటీవల పూజా షూటింగ్‌  సెట్‌లో బర్త్‌డేను కూడా సెలబ్రెట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పూజా గాయపడినట్లు తెలుస్తోంది. తన కాలు లిగ్మెంట్‌ టియర్‌ కావడంతో ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా పూజనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిది. కాలుకు పట్టి కట్టుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. లిగ్మెంట్‌ టియర్‌ అయ్యిందని ఆమె తెలిపింది. 

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడనవసరం లేదని, తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని కూడా తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే ఈ గాయం ఎలా అయ్యిందనేది మాత్ర ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా తను గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పూజ ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28తో పాటు విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్‌ జనగనమణ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న ఆమె రీసెంట్‌ మరో చిత్రాలనికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆమె రణ్‌వీర్‌ సింగ్‌ సరసన జోడి కట్టనుందట.

మరిన్ని వార్తలు