ఈ చిన్నారి ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఈ మధ్యే తల్లైంది కూడా!

22 Nov, 2021 15:36 IST|Sakshi

Shriya Saran Childhood Pics: ఈ మధ్య సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన సినీ తారలు వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి మధుర జ్ఞపకాలను అభిమానులతో పంచుకోవడంతో వారి ఫొటోటు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తమ అభిమాన నటీనటులను, హీరోహీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు చూసిన ఫ్యాన్స్‌ అంతా తెగ మురిసిపోతూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్‌ హాసన్‌

అలా కొంతమంది సెలబ్రెటీల ఫొటోలు ఇప్పటికే మీడియాలోకి ఎక్కగా తాజాగా మరో నటి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ తల్లితో కలిసి అలా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన ఈ చిన్నారి ఒకప్పటి మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. దాదాపు అందరూ అగ్ర హీరోలతో ఆమె ఆడిపాడింది. నాటి స్టార్‌ హీరోలతోనే కాదు నేటితరానికి చెందని పలువురు యంగ్‌ హీరోలతో కూడా ఆమె రొమాన్స్‌ చేసింది.  ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిలైయిపోయింది కూడా. అంతేకాదు ఈ మధ్యే ఆమె తల్లైనట్లు ప్రకటించి తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికైన ఆమె ఎవరో గుర్తోచ్చిందా.

చదవండి: యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..!

ఇటీవల ఓ విదేశీ వ్యాపారవేత్తను పెళ్లాడి, ఈ మధ్యే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఒకప్పటి మన స్టార్‌ హీరోయిన్‌ శ్రియా శరన్‌.  తల్లైన ఇప్పటికి అదే అందం, అభినయంతో ఆకట్టుకున్నఈ చిన్నారే మన శ్రియా. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన శ్రియ.. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వు-నేను, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, ఛత్రపతి, నేనున్నాను, శివాజీ, డాన్ శీను’ లాంటి పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి సుమారు 75 చిత్రాల్లో నటించిన శ్రియ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’, ‘నరగసూరన్’, ‘తడక’ చిత్రాల్లో నటిస్తోంది.

మరిన్ని వార్తలు