Shruti Haasan: ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయింది: శృతిహాసన్

4 Nov, 2022 16:19 IST|Sakshi

తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు సంపాదించుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువ విజయాలు అందుకున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ జంటగా సలార్‌లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ చిత్రాలను టార్గెట్ చేయడంపై ఆమె స్పందించారు. హిందీ చిత్రాలు విడుదల సమయంలో బాయ్‌కాట్‌ బాలీవుడ్ అంశం తెరపైకి రావడం పట్ల ఆమె మాట్లాడారు.
 
శృతిహాసన్ మాట్లాడుతూ..'ఇది కేవలం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీనికి చాలా కారణాలున్నాయి. మనమందరం దీనిపై ఒక్కసారి ఆలోచించుకోవాలి. సినిమాలను రద్దు చేయాలనే సంస్కృతి అనేది బెదిరింపు, దాడి చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం సమాజంలో ఆన్‌లైన్ సంస్కృతి సమాజంలో ద్వేషం నింపేలా మారింది.' అని అన్నారు. 

తాను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరించింది శృతిహాసన్. తనను 'చుడైల్' (తెలుగులో మంత్రగత్తె) అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దానిని అధిగమిస్తామని నాకు తెలుసు. నేను నా సొంత మార్గంలో ఆలోచిస్తాను అని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు