Vishnu Priya: కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ.. ‘తమ కోరిక తీర్చాలని అడిగారు’

17 Sep, 2022 17:57 IST|Sakshi

యాంకర్‌ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు, సోషల్‌ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్‌ ఫిలింస్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆతర్వాత యాంకర్‌గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రీసెంట్‌గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇటీవల ఆమె జరీ జరీ అనే అల్భం సాంగ్‌తో ఉర్రుతలుగించింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్‌హాట్‌ ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సైతం ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. బిగ్‌బాస్‌ ఫేం​ మానస్‌తో కలిసి ఆమె చేసిన ఈ అ‍ల్భమ్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. 

చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌

ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ సాంగ్‌ ఆఫర్‌ తనకు స్టార్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ వల్ల వచ్చిందని, ఆపాటకు ఆయన తన పేరును రెఫర్‌ చేశారని చెప్పింది. ఇక ఇండస్ట్రీలో మేల్‌ డామినేషన్‌ ఎక్కువ అంటున్నారు.. మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘అవును పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ అనేది నిజమే. అయితే అది పోవడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకు స్వతంత్య్రం వచ్చింది. ఆడవాళ్లు కూడా ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆయా రంగాల్లో మహిళలు రాణించాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా 15-20 ఏళ్లలో ఆడవాళ్లు కూడా మగవాళ్లకు పోటీగా వస్తారు’ అని చెప్పింది. 

చదవండి: ‘సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు, ఆ స్క్రీన్‌ షాట్స్‌ తీసి పెట్టుకున్నా’

ఇక కాస్టింగ్‌ కౌచ్‌పై అభిప్రాయం అడగ్గా.. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది కేవలం ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా ఉందని చెప్పింది. ‘కాస్టింగ్‌ కౌచ్‌ అనేది అన్నిచోట్ల ఉంది. కానీ అది చూస్‌ చేసుకోవలా? వద్దా? అనేది ఆడవాళ్ల చేతిలో ఉంది. మనకు ఎప్పుడు రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. అందులో ఏది చూస్‌ చేసుకోవాలన్నది అమ్మాయి వ్యక్తిగతం. అదే నన్ను చూసుకోండి. ఆఫర్స్‌ కోసం చూస్తున్న సమయంలో నన్ను కూడా చాలా మంది కోరిక తీర్చాలని అడిగారు. దానివల్ల ఎన్నో ఆఫర్లు వదులున్నా’ అని చెప్పుకొచ్చింది. అనంతరం తనకు యాంకర్‌ అనే ట్యాగ్‌ వద్దని, అలా పిలిపించుకోవడం ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇక్కడ తన కంటే అందంగా, చాలా బాగా తెలుగు మాట్లాడే యాంకర్స్‌ ఉన్నారని, వారితో సమానంగా యాంకర్‌ అని పిలుపించుకుని ఆ పదం విలువ తీయలేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

మరిన్ని వార్తలు