ఆమె ‘ఆది పురుష్’‌ సీత.. త్వరలో ప్రకటన!

28 Nov, 2020 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్యాన్‌ ఇండియా నటుడిగా పేరుతెచ్చుకున్నారు. దీంతో డార్లింగ్‌ ప్రభాస్‌కు సంబంధించిన ఏ విషయమైన వార్తల్లో నిలుస్తోంది. అదే విధంగా ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ సినిమాలకు సంబంధించిన ఆయా అప్‌డేట్స్‌ ఆన్‌లైన్‌లో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ‘రాధేశ్యామ్‌’ షెడ్యూల్‌ చివరి దశకు చేరుకోగా.. ‘ఆది పూరుష్‌’ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటి వరకు సీత పాత్రకు హీరోయిన్‌ ఖరారు కాకపోవడం‍తో పలు హీరోయిన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ‘ఆది పురుష్‌’ సీతకు కీర్తి సురేష్‌ పేరు వినిపించింది. ఆ తర్వాత వరుసగా అనుష్కా శర్మ, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీల నటించనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఇటీవల చిత్ర యూనిట్‌ ఖండిచింది. వీరిలో ఎవరూ ‘ఆది పురుష్‌’ సీతలు కారని స్పష్టం చేయడంతో కొత్తగా కృతిసనన్‌ పేరు తెరపైకి వచ్చింది. (చదవండి: ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన చిత్ర బృందం)

అయితే తాజాగా సమచారం మేరకు ‘ఆది పురుష్’‌ సీతగా కృతిసనన్‌ను ఖారరు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ సరసన సీతగా కృతి సరైన జోడిగా భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు పాత్రను వివరించడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిదని, ఇక త్వరలోనే ‘ఆది పురుష్‌’ సీతగా కృతిని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేష్‌(రావణుడి) పాత్రను పోషిస్తున్నారు. టీ-సిరీస్‌ పతాకంపై భూషన్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌లు పనులు ఇటీవల పూర్తి కావడంతో 2021 జనవరిలో షూటింగ్‌ సెట్స్‌లోకి వెళ్లనుందట. 3డీలో రూపొందనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా దేశవ్యాప్తంగా 2022 అగష్టు 11న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. (చదవండి: మిస్ట‌రీ: అప్పుడు క‌ట్ట‌ప్ప‌, ఇప్పుడు సీత‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా