మైదానంలోకి వస్తున్నారు

7 Dec, 2020 05:54 IST|Sakshi

అజయ్‌ దేవగన్‌ హీరోగా అమిత్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘మైదాన్‌’. ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్‌ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. కోవిడ్‌ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్‌ స్టేడియం సెట్‌ని లాక్‌ డౌన్‌ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్‌. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు