-

కాంబినేషన్‌ కుదిరిందా? 

27 Nov, 2023 03:07 IST|Sakshi

హీరో అజిత్‌ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ అజర్‌బైజాన్‌లో పూర్తయిందని కోలీవుడ్‌ టాక్‌. అయితే అజిత్‌ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్‌ తెరపైకి వచ్చింది.

అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్‌ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు