-
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన అద్భుతమైన ఫిజిక్, స్టైల్‌తో ఫ్యాన్స్‌ను ఎపుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూత లూగించడం, లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చెయ్యడం అలవాటు.పబ్లిక్ అప్పీరెన్స్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవడం ఆమెకు అలవాటు.తన వార్డ్‌రోబ్‌లో లగ్జరీ యాక్ససరీస్‌కు పాపులర్ అయిన ఈ చయ్యా చయ్యా అమ్మడు ఇటీవల వెకేషన్‌ను ఎంజాయ్ చేసి వచ్చిందట అజర్‌బైజాన్‌లోని బాకులో ఆనందంగా గడిపిన క్షణాలుంటూ కొన్నిఫోటోలు, వీడియోతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజర్బైజాన్ వెకేషన్లో ధరించిన వైట్-హ్యూడ్ ట్యాంక్ డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తెల్లని పొడవాటి వైట్ గౌను, మెడలో రెండు గొలుసులు, సన్ గ్లాసెస్‌తో స్పెషల్ లుక్‌లో ఉంది. సోర్చ్ అన్నోన్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ ధర భారతీయ కరెన్సీలో టాక్స్‌లు మినహాయించి రూ. 5,909లట. కాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం ,అర్హాన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ హీరో అర్జున్ కపూర్ల ప్రేమయాణం గురించి తెలిసిందే. -
అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్
Azerbaijan Grand Prix: ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఐదో టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 05.941 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో 21వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! -
లెక్లెర్క్కు ఆరో పోల్ పొజిషన్... నేడు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ క్వాలిఫయింగ్ సెషన్స్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మరోసారి సత్తా చాటుకున్నాడు. బాకు నగరంలో శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.359 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీజన్లో లెక్లెర్క్కిది ఆరో పోల్ పొజిషన్ కావడం విశేషం. సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం ఏడు రేసులు జరగ్గా... వెర్స్టాపెన్ నాలుగు రేసులో, లెక్లెర్క్ రెండు రేసుల్లో, పెరెజ్ ఒక రేసులో విజేతగా నిలిచారు. -
అజర్బైజాన్లో తప్పిపోయిన భారత యువకుడు
ఒంటరిగా సాహసయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన భారతీయ యువకుడి కోసం అతడి కుటుంబం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అతడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోంది. మణికాంత్ కొండవీటి (28) అనే యువకుడు ఏప్రిల్ 26న ఇండియా నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాడు. తర్వాత నుంచి అతడు జాడ లేకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతడి జాడ కనిపెట్టేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రయత్నాల గురించి మణికాంత్ సోదరుడు ధరన్.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తమ సోదరుడి ఫొటోలను షేర్ చేశారు. ‘ఫోటోలో మీరు చూస్తున్న అబ్బాయి నా సోదరుడు మణికాంత్. గత రెండు వారాల నుంచి అతడు కనిపించడం లేదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడంతో మా కుటుంబ సభ్యులంతా నిద్రాహారాలకు దూరమయ్యారు. మణికాంత్ నాకు సోదరుడు మాత్రమే కాదు ఆత్మీయ మిత్రుడు. అతడికి సాహస యాత్రలంటే చాలా ఇష్టం. ఒంటరిగా అజర్‌బైజాన్‌కు వెళ్లాలని నాకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రయాణానికి ఒకరోజు ముందు ఢిల్లీలో ఉంటున్న నా దగ్గరకు వచ్చాడు. తర్వాత రోజు స్వయంగా నేను నా సోదరుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేశాను. మళ్లీ వెళ్లినప్పుడు నేను కూడా వస్తానని చెప్పాను. ఏప్రిల్ 26న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు మాతో టచ్‌లో ఉన్నాడు. అదే రోజు రాత్రి 7 గంటలకు చివరిసారిగా మాట్లాడా. నేను తర్వాత మెసేజ్ చేశాను కానీ అది డెలివరీ కాలేదు. దీంతో కాస్త భయపడ్డాను. బహుశా అక్కడ నెట్వర్క్ లేదేమో అనుకున్నాను. తర్వాత అతడిని కాంటాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏం చేయాలో తెలియక అజర్‌బైజాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాం. కొండ ప్రాంతంలో ఉండి ఉంటాడని, అందువల్ల సిగ్నల్ సమస్య ఉండొచ్చని దౌత్య అధికారులు తెలిపారు. మేము పలుమార్లు ప్రాధేయపడటంతో మణికాంత్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. మణికాంత్ జాడ కనిపెట్టడానికి ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు అందరినీ సంప్రదించాం. అతడి ఫొటోలను కూడా సర్క్యులేట్ చేశాం. అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమ్మ తన ఫోన్ మోగినప్పుడల్లా మణికాంతే అనుకుంటుంది. నా సోదరుడి ఫోన్ కాల్ కోసం ప్రార్థిస్తున్నాను. మణికాంత్ క్షేమంగా తిరిగి వస్తాడని గట్టిగా నమ్ముతున్నామ’ని ధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలబడాలని అందరినీ అభ్యర్థించాడు. change.orgలో తాము చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతు పలకాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాకు ఓటు ఎవడేస్తాడు.. నువ్వా? నీ అమ్మ మొగుడా.. లేక నీ అమ్మమ్మ మొ...
ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి
పోస్టల్ బ్యాలెట్‌కు నేడూ అవకాశం
అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా
No Headline
రైతుబజార్‌ను మరింత అభివృద్ధి చేస్తా
ఉదయగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్
టీడీపీ అభ్యర్థి నారాయణను నమ్మొద్దు
బాబుకు ఓట్లేస్తే జన్మభూమి కమిటీలదే పెత్తనం
టీడీపీకి ఓట్లేస్తే సంక్షేమ పథకాలు రద్దే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement