పోలింగ్ సమయంలో అభిమాలనుపై అజిత్‌ అసహనం

6 Apr, 2021 09:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. తమిళ హీరో అజిత్‌ తన భార్య షాలినీతో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటు వేసి బయటకు వచ్చిన హీరో అజిత్‌తో సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఇబ్బందిపడిన అజిత్‌ ఓ అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అభిమానులపై అజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్నికలు పోలింగ్‌ సమయంలో చాలా కూల్‌గా లైన్‌లో వేచి ఉండి మరీ ఓటు వేసే అజిత్‌ అభిమానుల గందరగోళానికి ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. సింప్లిసిటీతో ఉండే అజిత్‌ క్యూలైన్‌లో ఓటు వేయడానికి నిల్చోవడంతో అభిమానులు తమ హీరోతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. చుట్టు చేరిన అభిమానల తాకిడితో అజిత్‌ ఒకింత అసహనానికి గురయ్యారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌

 ఓటు హక్కు వినియోగించుకున్న హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తీ

ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు కమల్‌ హాసన్‌, తన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్‌ 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు