-
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలోని పాటను లాంచ్ చేసారు RGV
-
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ తో హెబ్బా హిట్ కొట్టాలి: నాగార్జున
చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (USA) పతాకంపై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్ని కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..దర్శకుడు బాల నాకు సుపరిచితుడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డీన్ గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారు. అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు 'హనీమూన్ ఎక్సప్రెస్' చిత్రం లో అవకాశాలు ఇచ్చాడు. ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం కలిగి ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా రొమాంటిక్ గా వచ్చాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి’అని అన్నారు. ‘‘హనీమూన్ ఎక్సప్రెస్' ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి మరియు సుహాసిని గార్ల క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్ గా ఉంటాయి. యూత్ కి, ప్రేమికుల కి మా చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ వివరాలతో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement