పుష్ప టీజర్‌‌: ఊరనాటుగా అల్లు అర్జున్‌

7 Apr, 2021 20:46 IST|Sakshi

వేట కొడవలితో ఊర నాటుగా కనిపిస్తున్న అల్లు అర్జున్‌

తెల్లారితే(ఏప్రిల్‌ 7న) అల్లు అర్జున్‌ బర్త్‌డే. అందుకని ఫ్యాన్స్‌ కోసం ఒకరోజు ముందే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది పుష్ప చిత్రయూనిట్‌. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు పుష్పరాజ్‌ను పరిచయం చేస్తామని మాటిచ్చింది. కానీ తీరా సమయానికి హ్యాండిస్తూ పరిచయం మరింత ఆలస్యం కానుందని అప్‌డేట్‌ ఇచ్చింది. 8.19 గంటలకు పుష్పరాజ్‌ వస్తున్నాడని, మీ ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందని భరోసా ఇచ్చింది.

చివరకు లేట్‌గా వచ్చిన ఈ టీజర్‌ ఓ రేంజ్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌ రచ్చ మొదలు పెట్టేశారు. ఇందులో బన్నీ తలను ముసుగుతో కప్పినా తూటాలను తప్పించుకుంటూ పరుగు తీస్తున్నాడు. దట్టమైన అడవిలో అర్ధరాత్రి పూట లాంతరులో వన్యం జనాలకు దారి చూపిస్తూ, తన దారికి అడ్డొచ్చే పోలీసులను చితక్కొడుతూ "తగ్గేదే లే.." అంటున్నాడు. ఈ టీజర్లో వేట కొడవలితో ఊరనాటు లుక్‌లో కనిపిస్తున్నాడు బన్నీ. ఇక టీజర్‌లో బీజీఎమ్‌ కూడా వీర లెవల్‌లో ఉంంది. ఫైట్‌ సీన్లు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పుష్పరాజ్‌ ఫస్ట్‌ మీట్‌ మామూలుగా లేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

కాగా ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో బన్నీ చేస్తున్న చిత్రం "పుష్ప". ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు‌. రష్మికా మందన్నా పల్లెటూరి యువతిగా కనిపించనుండగా ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్ర పోషిస్తున్నాడు‌. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది.

చదవండి: అల్లు అర్జున్‌ బర్త్‌డే సీడీపీ: అప్పుడే ట్రెండింగ్‌లోకి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు