నాన్‌స్టాప్‌ నలభై రోజులు

27 Aug, 2020 02:25 IST|Sakshi

ఆరు నెలల లాక్‌డౌన్‌ బ్రేక్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి షూటింగ్‌ మొదలుపెట్టడానికి ‘పుష్ప’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ మొదటివారంలో ప్రారంభం కానుందని సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ నడుస్తుంది. ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడతారట అల్లు అర్జున్‌. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమా షెడ్యూల్‌ సుమారు నలభై రోజులపాటు నాన్‌స్టాప్‌గా సాగనుందని తెలిసింది. దాదాపు 30 శాతం చిత్రీకరణను ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్‌ అట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు