'పుష్ప' కోసం అల్లు అర్జున్‌ ఎంత తీసుకున్నాడంటే?

9 Apr, 2021 16:54 IST|Sakshi

పుష్ప టీజర్‌ రిలీజైన నాటి నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హడావిడే కనిపిస్తోంది. టీజర్‌ విడుదలైన తెల్లారే బన్నీ బర్త్‌డే కావడంతో ఈ హంగామా తారాస్థాయికి చేరింది. దీనికి తోడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ.. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద లేజర్‌, లైట్‌ షో ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు పుష్ప టీజర్‌ యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్పకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ రూ.35 కోట్లు, దర్శకుడు సుకుమార్‌ రూ.25 కోట్లు తీసుకుంటున్నారట. ఇందులో విలన్‌గా నటిస్తున్న మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ రూ.5 కోట్లు, హీరోయిన్‌ రష్మిక మందన్నా రూ.2 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల అవుతోంది.

చదవండి: వీడియో వైరల్‌: హైదరాబాద్‌కు రజనీకాంత్‌

బన్నీ ఖాతాలో మరో అరుదైన ఘనత

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు