అది ఐటెం సాంగ్‌ కాదమ్మ.. అనసూయ కౌంటర్‌

2 Mar, 2021 18:08 IST|Sakshi

అనసూయను ట్రోల్‌ చేసిన నెటిజన్‌

స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన రంగమ్మత్త

అనసూయ భరద్వాజ్‌.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర, వెండి తెర మీద యాంకర్‌గా, నటిగా తన సత్తా చాటుతున్నారు అనసూయ. ఓ పక్క ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధన్యమున్న పాత్రలు చేస్తూనే.. మరో వైపు ప్రత్యేక గీతాల్లో కనిపిస్తున్నారు. ఇక బుల్లి తెర మీద యాంకర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ప్రత్యేక గీతంలో కనిపించారు. పైన పటారం.. లోన లోటారం అంటూ సాగే ఈ పాటలో అనసూయ, కార్తికేయతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఓ ట్విట్టర్‌ యూజర్‌ అనసూయను ఉద్దేశించి ‘‘ఐటెం సాంగ్స్‌ చేయను అన్నారు కదా.. మరి ఇదేంటి అండి.. అయినా ఆ లిరిక్స్‌ ఏంది’’ అంటూ అనసూయను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. సదరు యూజర్‌కి అనసూయ స్ట్రాంగ్‌ కౌంటరే ఇచ్చారు. ‘‘నా కెరీర్‌ నా నమ్మకాల మీద, చాయిసెస్‌ మీద నిర్మితమై ఉంటుంది తప్ప.. ఎవరో రాసిన దాని మీద కాదు’’ అంటూ రిపై ఇచ్చారు. 

ఈ మేరకు అనసూయ ‘‘అది ఐటెం సాంగ్‌ కాదు.. అసలు ఐటెం సాంగ్‌ అంటూ ఏది లేదమ్మ. ఒక పాటకున్న క్యాస్ట్‌ కాకుండా.. స్పెషల్‌గా ఎవరన్న కావాలి అనుకున్నప్పుడు స్పెషల్‌ సాంగ్‌ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా భావించే వాళ్లు​ ఇచ్చిన పేరు అది. అంతేకాదు ఆ లిరిక్స్‌ వల్లనే నేను ఈ స్పెషల్‌ సాంగ్‌ ఒప్పుకున్నాను’’ అన్నారు. 

అంతేకాదు ‘‘నేను స్పెషల్‌ సాంగ్‌ చేయ్యను అని ఎక్కడా అనలేదు. దయచేసి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నన్నే అడగండి. నా గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా .. నన్ను అడగండి. ఇప్పుడు చేసినంత వెటకారంగా కాకపోయినా.. నిజాయతీగా ఏమన్నా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అంతేకాని ‘‘సమాచారం ప్రకారం’’ అంటూ రాసే వార్తలను నమ్మకండి. నా కెరీర్‌ నా నమ్మకాలు, చాయిస్‌ల మీద కొనసాగుతుంది తప్ప ఎవరో రాసినదాని మీద కాదు’’ అంటూ ట్వీట్‌ చేశారు అనసూయ.

దీనిపై నెటిజనుల చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.

చదవండి:
అనసూయ మాస్‌ సాంగ్‌​.. దుమ్ములేపేసింది!
ఓ మై గాడ్‌! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు