నా బాధ తనలో చూస్తున్నాను: నిఖిల్‌ 

24 Feb, 2021 09:23 IST|Sakshi
వీరాస్వామి, సొహైల్, రంజిత్, నిఖిల్‌

‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటను చాలా ఏళ్లుగా వింటున్నాను. ఆ తేడా నాకు తెలియదు. బడ్జెట్‌ ఎంత? నటీనటులు ఎవరు? అనేదానికంటే సినిమా ఇచ్చే అనుభూతి ముఖ్యం అని నా భావన. అనుభూతిపరంగా చూస్తే ‘ఏప్రిల్‌ 28 ఏం జరిగింది’ చాలా పెద్ద సినిమా అవుతుంది. నా యువత, అంకిత్‌ పల్లవి అండ్‌ ఫ్రెండ్స్‌’ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన బాధ, తపన రంజిత్‌లో చూస్తున్నాను. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా’’ అన్నారు హీరో నిఖిల్‌.

రంజిత్, షెర్రీ అగర్వాల్‌ జంటగా స్వీయ దర్శకత్వంలో వీరాస్వామి .జి నిర్మించిన ‘ఏప్రిల్‌ 28 ఏం జరిగింది’ ఈ నెల 27న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో.. ‘‘ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది’’ అన్నారు ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సయ్యద్‌ సొహైల్‌. ‘‘మార్చి 5న మా సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఈ 27న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు వీరాస్వామి.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు