బిగ్‌బాస్‌ భామకు కరోనా పాజిటివ్‌

20 Mar, 2021 13:28 IST|Sakshi

ముంబై: హిందీ బిగ్‏బాస్ 14 కంటెస్టెంట్‌‌, నటి నిక్కీ తంబోలి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేధికగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె హోం క్వారటైన్‌ ఉన్నట్లు తెలిపింది. అంతేగాక ఇటీవల కాలంలో తనని కలిసిన వారంత ఐసోలేషన్‌కు వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. ఇటీవల బిగ్‌బాస్‌ 14వ సిజన్‌ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిజన్‌లో పాల్గోన్న కంటెస్టెంట్స్‌లో నిక్కితంబోలి ఒకరు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా నిక్కి కరోనా లక్షణాలతో బాధపడుతుంటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తెలినట్లు ఆమె పోస్టులో  వెల్లడిచింది. దీంతో ఆమె డాక్టర్ సూచన మేరకు హోం క్యారంటైన్‏కు వెళ్లానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చింది.

అంతేగాక ఇటీవల తనను కలిసిన వారంతా దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. అయితే నిక్కి తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’ మూవీలో కూడా నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత నిక్కికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో తిరిగి బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని ఆమె హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కాగా దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.  గతకొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కరోనా భారీగా పడుతున్నారు.

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

చదవండి: 
త్రిషకు చేదు అనుభవం, హర్టయిన ఫ్యాన్స్‌ 
లోదుస్తుల్లో బిగ్‌బాస్‌ భామ.. అక్కడ చేతులేసిన కుర్రాడు
బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటా, కానీ: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు