బిగ్‌బాస్‌కు ఐపీఎల్ గండం!

5 Sep, 2020 16:59 IST|Sakshi

బిగ్‌బాస్ కోసం వెయిట్ చేస్తే ఆ కిక్కే వేర‌ప్పా!

ఈసారి తెలుగు బిగ్‌బాస్ అంతా గంద‌ర‌గోళంగా ఉంది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి షో ప్రారంభ తేదీ వ‌ర‌కు ఎన్నో గజిబిజి సందేహాలు, అంతులేని అనుమానాలకు తావిచ్చాయి. ఎప్పుడైతే స్టార్ మా యాజ‌మాన్యం బిగ్‌బాస్ ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని.. త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుందంటూ ప్రోమో వ‌దిలిందో స‌గం అనుమానాలు ప‌టాపంచ‌లు అయిపోయాయి. ఆ త‌ర్వాత క్ష‌ణం నుంచి కంటెస్టెంట్లు వీళ్లంటే వీళ్లేనంటూ ఎంద‌రో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మాకు తెలియ‌కుండా మేము ఎప్పుడు బిగ్‌బాస్‌కు వెళ్తున్నామంటూ కొంద‌రు ఈ పుకార్ల‌ను ఖండించారు. (చ‌ద‌వండి: విడాకులు తీసుకున్నాం: నోయల్‌)

మ‌రికొంద‌రు ఈ ప్ర‌చారంతో ఫ్రీగా ప‌బ్లిసిటీ దొరుకుతుంద‌ని గ‌మ్మునుంటున్నారు. నిజంగా పాల్గొనేవాళ్లు మాత్రం ఏమీ ఎర‌గ‌న‌ట్టుగా నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్టు ఊరుకుండిపోయారు. షోలో ఎవ‌రు అడుగు పెట్ట‌బోతున్నార‌నేది రేపు ఎలాగో తెలుస్తుంది. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడ‌దాం. మ‌రోవైపు "మ‌న‌కు న‌చ్చేదాని కోసం వెయిట్ చేస్తే ఆ కిక్కే వేర‌ప్పా! ఇంకా ఒకే రోజు" అంటూ డిస్నీ హాట్‌స్టార్‌ కౌంట్‌డౌన్ చేస్తూ ఓ వీడియో వ‌దిలింది. ఇక అన్న‌పూర్ణ స్టూడియోలో కంటెస్టెంట్ల‌ ఎంట్రీ షూటింగ్ నేడు ప్రారంభ‌మైంది. దీంతో రేపు షో ఎలా ఉండ‌బోతుంది? ముందు సీజ‌న్ల మాదిరిగానే ఉంటుందా? ఎవ‌రెవ‌రు ఎలా ఎంట్రీ ఇస్తారు?  ముందెవ‌రు వ‌స్తారు?  చివ‌ర్లో ఎవ‌రు వ‌స్తారు? ఈ సారి నాగార్జున పండు.. అదే కోతి బొమ్మ‌ను ప‌ట్టుకొస్తాడా? మ‌ళ్లీ ర‌మ్యకృష్ణ వ‌స్తుందా?‌ లేదా ఇలా బోలెడు ఆలోచ‌న‌ల‌తో బుర్ర‌లు బ‌ద్ద‌లు చేసుకుంటున్నారు. రేపు సాయంత్రం ఆరు ఎప్పుడ‌వుతుందా అని క్ష‌ణానికోసారి గ‌డియారం వంక చూస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్ర‌సక్తే లేదు: న‌టి)

ఈ సంద‌ర్భంగా  సోష‌ల్ మీడియాలో బిగ్‌బాస్ ప్రేమికులు మీమ్స్‌, కామెంట్ల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఇది ప్రారంభం కాగానే అటు ఐపీఎల్‌, ఆ వెంట‌నే హిందీ బిగ్‌బాస్ 14 ప్రారంభం అవుతాయి. అప్పుడు ఏం చేసేది చెప్మా అని ఇప్ప‌టినుంచే తెగ కంగారు ప‌డుతున్నారు. "మ‌రికొంద‌రు మాత్రం పెద్ద‌గా అప్‌డేట్స్ ఏం లేవుగా ఈ సారి", "అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదేంట్రా బాబు" అని కామెంట్ల రూపంలో అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. "అంద‌రూ ఐపీఎల్‌కే జై కొడితే బిగ్‌బాస్ ఎవ‌ర్రా చూసేది?", "ఈసారి ఐపీల్ రాబోతోంది కాబ‌ట్టి బిగ్‌బాస్‌ టీఆర్పీకి గండి ప‌డిన‌ట్లే"న‌ని మ‌రికొంద‌రు జోస్యం చెప్తున్నారు. చూడాలి మ‌రి! అది బిగ్‌బాస్ హౌస్‌. అక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ 4: గాసిప్ వార్త‌ల‌పై లేటెస్ట్ ప్రోమో)

మరిన్ని వార్తలు