‘బిగ్‌బాస్‌​’లో మిర్చి మంట.. మెహబూబ్‌ టార్గెట్‌

12 Oct, 2020 16:40 IST|Sakshi

బిగ్‌ బాస్‌  సీజన్‌ 4 చూస్తుండగానే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. గంగవ్వ హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం, సుజాత ఎలిమినేషన్‌తో  ఐదోవారానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక ఆరోవారం హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కేలా ఉంది. నామినేషన్‌ డే (సోమవారం) రావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ‘ఘూటు’గా సాగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. నామినేషన్‌ కోసం ఘూటుగా ఉండే ఎండు మిర్చిల దండలను పంపిన బిగ్‌ బాస్‌.. కంటెస్టెంట్స్‌ మధ్య గొడవల ఘూటును కూడా మరింత పెంచాడు. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎక్కువగా మెహబూబ్ బుక్కయినట్లు తెలుస్తోంది. గతవారం హోటల్ టాస్క్ లో అతను చేసిన రచ్చకు హోటల్‌ సిబ్బంది ‘ఘూటు’గా రివేంజ్‌  తీర్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక ఇంటి కెప్టెన్‌ కావడంతో సోహైల్‌ ఈ వారం బతికిపోయాడు. లేదంటే అతను కూడా మెహబూబ్‌లాగా బుక్కయ్యేవాడేమో. ఇక అభిజిత్‌, అఖిల్‌ మధ్య మరోసారి వార్‌ జరిగినట్లు తెలుస్తోంది.  ఎండుమిర్చిల దండలను ఒకరిపై మరొకరు వేసుకున్నారు. కెప్టెన్సీ గేమ్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్‌ తీరును తప్పుబడుతూ అఖిల్‌ నామినేట్‌ చేయగా.. అభి కూడా అదే తరహా రీజన్‌ చెబుతూ.. అఖిల్‌ను నామినేట్‌ చేశాడు. ఇక మరోసారి మోనాల్‌ కంటతడి పెట్టింది. తన గురించీ ఎవరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా సమస్యలను నేను పరిష్కరించుకోగలనని ఏడుస్తూ చెప్పింది. ఇక అరియన కూడా మెహబూబ్ పై విమర్శలు చేసింది. దానికి మెహబూబ్ కూడా ఘాటుగానే స్పందించినట్టు చూపించారు. దివి గత గొడవలను గుర్తు చేసుకుంటూ.. దెబ్బలు తగిలించుకోవడానికి రాలేదంటూ హౌస్‌మేట్స్‌పై మండిపడింది. మోనాల్‌ దండవేస్తుంటే అసహనంతో తెంచి పడేసింది.  ఇక సోహెల్ కి కూడా కుమార్ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వేలు దించి మాట్లాడు అంటూ సోహెల్ కుమార్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ లో  మిర్చి ఘాటు గట్టిగానే తగిలినట్లుంది. 

మరిన్ని వార్తలు