అభిమాని మృతిపై స్పందించిన ‘బింబిసార’ యూనిట్‌

30 Jul, 2022 13:15 IST|Sakshi

బింబిసార ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అభిమాని సాయిరాం మృతిపై చిత్ర యూనిట్‌ స్పందించింది. సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి సోషల్‌ మీడియా వేదికగా సానుభూతి తెలియజేశారు. ‘పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలానికి చెందిన పుట్ట రాంబాబు కొడుకు సాయిరాం శుక్రవారం రాత్రి జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చి మృతి చెందడం బాధాకరం. అతని కుటుంబానికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. సాయిరాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’అంటూ బింబిసార టీమ్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ నుంచి ఓ లేఖని సోషల్‌ మీడియాలో వదిలారు. 

కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది.  ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిథిగా వచ్చాడు. 

మరిన్ని వార్తలు