మనీష్ మల్హోత్రాకు బీఎంసీ నోటీసులు

10 Sep, 2020 18:08 IST|Sakshi

ముంబై: బాద్రాలోన కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని నిన్న బృహన్‌ ముంబై కార్పోరేషన్‌(బీఎంసీ) అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనిష్‌ మల్హోత్రాకు బీఎంసీ సివిక్‌ బాడీ‌ నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీఎంసీ గురువారం నోటిసులు జారీ చేసింది. కంగనా పాలి హిల్స్‌ కార్యాలయం పక్కనే మనీష్‌ భవనం కూడా ఉంది. సెక్షన్‌ 351 కింది బీఎంసీ ఈ నోటిసులు జారీ చేసింది. ఇందులో ముంబై మున్పిపల్‌ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా మనీష్‌ భవన నిర్మాణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక దీని కట్టడంలో నాలుగు ఉల్లంఘనలు ఉన్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది. (చదవండి: ‘క్వీన్‌’ ఆఫీస్‌లో కూల్చివేతల)

మొదటి అంతస్తును ఇటుక రాతితో రెండు గోడలు అక్రమంగా నిర్మించి క్యాబిన్‌లుగా పార్టిషన్స్ చేశారని‌, రెండవ అంతస్తులో గోడలను ఆనధికారికంగా నిర్మించడమే కాకుండా, అదే అంతస్తులో టెర్స్‌ మీద సిమెంట్‌ షీట్‌ పైకప్పు, సెడ్‌లను నిర్మాణాం, అలాగే టేర్స్‌పై ఉక్కు రాడ్లు, సిమెంట్‌ షీట్‌ను పైకప్పు నిర్మించినట్లు నోటీసులలో వివరించారు. అయితే కంగనా కార్యాలయాన్ని ముంబై హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చిట్లు బీఎంసీ ఇవాళ స్పష్టం చేసింది. అంతేగాక కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉన్నతాధికారులను ఇవాళ ఉదయం ప్రశ్నించారు. కాగా గత కొద్ది రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబైని పీఓకేతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. (చదవండి: కంగన ఆఫీస్‌ కూల్చివేత.. గవర్నర్‌ సీరియస్‌!)

మరిన్ని వార్తలు