జాని లీవర్‌ నటించిన తెలుగు సినిమా గుర్తుందా?

4 Feb, 2021 08:57 IST|Sakshi

ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగువాడు తన సత్తా చూపిస్తే మనకు సంతోషం వేస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి తండ్రి హయాంలో వలస వెళ్లి ముంబైలో ఎన్నో కష్టాలు పడి టాప్‌ కమెడియన్‌గా ఎదిగిన నటుడు జాని లీవర్. అతను ఉంటే సినిమాకు ప్లస్‌ అనే పేరు సంపాదించాడు. మధ్యలో కొంతకాలం బ్రేక్‌ వచ్చినా రోహిత్‌ శెట్టి ‘గోల్‌మాల్‌ అగైన్‌’లో నటించి ఆ సినిమా హిట్‌లో భాగం అయ్యాడు. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘సర్కస్‌’ అనే కామెడీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నాడని భోగట్టా. తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి ‘జాని లీవర్‌ సర్కస్‌ టీమ్‌తో జాయిన్‌ అయ్యారు’ అని అనౌన్స్‌ చేశాడు.

అందుకు నిదర్శనంగా వానిటీ వ్యాన్‌పై ‘ది ఒన్‌.. ది ఓన్లీ జాని లీవర్‌’ అని రాసి ఉన్న నోటీస్‌ ఫొటో పెట్టాడు. సాధారణంగా వానిటీ వ్యాన్‌పై అలా ప్రత్యేకమైన నోటీస్‌లు పెట్టారు. జాని లీవర్‌ ఆ సినిమాకు ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇలా పెట్టారు. జాని లీవర్‌ ఇంట్లో తెలుగు పిలుపులు నేటికీ వినపడతాయి. జాని లీవర్‌ పిల్లలు తండ్రిని ‘నాన్నా’ అనే పిలుస్తారు. అప్పుడప్పుడు జాని లీవర్‌ తన ఊరికి వచ్చి వెళుతుంటాడు. అన్నట్టు ఆయన నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా? క్రిమినల్‌. అక్కినేని నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో జాని లివర్‌ నటించాడు.
(చదవండి: చాలా రోజుల తర్వాత.. సంతోషంగా ఉంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు